Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: 2026 ఇండియన్ వెల్స్ ఫైనల్‌లో కజకిస్తాన్ కు చెందిన ఎలెనా రైబాకినాను బెలారస్‌కు చెందిన అరినా సబలెంకా ఓడించింది. దీంతో సబలెంకా తన తొలి BNP పారిబాస్ ఓపెన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సోమవారం ఇద్దరు స్టార్ల మధ్య జరిగిన ఈ టైటిల్ పోరు రెండున్నర గంటల పాటు కొనసాగింది. చివరికి, తన చిరకాల ప్రత్యర్థి రైబాకినాను 3-6, 6-3, 7-6 (8-6) తేడాతో ఓడించి సబలెంకా విజయం సాధించింది. ఇది ఆమెకు 23వ సింగిల్స్ టైటిల్ విజయం. అలాగే, WTA 1000 స్థాయిలో 10వది. 

ఈ ఏడాది టెన్నిస్‌ ప్రారంభ సీజన్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో అరీనా సబలెంకా, ఎలీనా రైబాకినా ఢీకొన్నారు. ఈ పోరులో సబలెంకా ఓడి టైటిల్ ను కోల్పోయింది. ఈ ఓటమికి BNP పారిబాస్ ఓపెన్ లో రైబాకినాను ఓడించి సబలెంకా ప్రతీకారం తీర్చుకుంది.