Reading Time: < 1 minute

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేట వద్ద ఒఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో వారికి ఆకలి వేయడంతో కారు ఆపి భోజనం చేస్తుండగా.. వారిపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.