Reading Time: < 1 minute

తమిళ స్టార్ హీరో సూర్య, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరీ కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమా  ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. సార్/వాతి, లక్కీ భాస్కర్ వంటి వరుస విజయాల తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమిళ్, తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.