Reading Time: < 1 minute

వంట గ్యాస్‌ సరఫరాపై మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం LPG సిలిండర్ల సరఫరా ఉంటుందని సోమవాకం కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో వంట గ్యాస్ స్టాక్‌ ఉందని తెలిపింది. హర్మూజ్‌ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయని..48 వేల మెట్రిక్‌ టన్నుల శివాలిక్‌ నౌక ఇవాళ సాయంత్రం 5 గంటలకు భారత తీరానికి చేరుకుంటుందన కేంద్రం వెల్లడించింది.

కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో స్వల్పంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో హెటళ్లు, హాస్టల్స్ ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. మరోవైపు, కేంద్రం.. LPG బుకింగ్ కాలపరిమితిని పట్టణాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచింది. అయితే, ఇరాన్ తో చర్చల అనంతరం భారత్ నౌకలకు అనుమతి లభించింది. ప్రస్తుతం రెండు LPG నౌకలు భారత్ కు వస్తున్నాయి.