Reading Time: < 1 minute

టీం ఇండియా యువ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి ్స్నేహితురాలు వన్షిక చడ్డాతో శనివారం ముస్సోరీలో కుల్దీప్ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు తిలక్ వర్మ, రింకు సింగ్, యుజవేంద్ర చాహల్, సురేష్ రైనా తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే తన పెళ్లి తర్వాత కుల్దీప్‌ తొలిసారి సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన భార్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన కుల్దీప్.. ‘‘అవర్ ఫరెవర్ బిగిరన్స్ నౌ 14.03.2026 అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై అభిమానులు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.