Reading Time: < 1 minute

ముంబై: దుబాయ్ కు వెళ్లే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీలు రద్దయ్యాయి. సోమవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరానియన్ క్షిపణి ఆయిల్ ట్యాంకర్‌ ను ఢీకొట్టింది. దీంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు దుబాయ్ విమానాశ్రయంలో అన్ని విమాన రాకపోకలను నిలిపివేశారు. ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్ పోర్టులో అన్ని కార్యకలాపాలు నిలిపేశారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. ఇవాళ దుబాయ్‌కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేశాయి. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ..

 “దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. అన్ని విమానాల రాకపోకలను నిలిపేశారు. దీంతో దుబాయ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు చేశాం. ఎయిర్‌లైన్ ప్రయాణీకుల అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నాం. తమ నుంచి ప్రయాణికులకు పూర్తి సహకారం ఉంటుంది” అని ఎయిర్ ఇండియా తెలిపింది. విమానాల రద్దుతో  ప్రయాణికుల అసౌకర్యాన్ని చింతిస్తూ.. రెండు ఆఫర్లను ప్రకటించింది.ఇందుల భాగంగా ప్రయాణికులకు ఎలాంట అదనపు ఖర్చు లేకుండా భవిష్యత్ ప్రయాణ తేదీని తిరిగి బుక్ చేసుకోవచ్చని.. అలాగే, బుకింగ్ రద్దు చేసి పూర్తి నగదును వాపసు పొందవచ్చని పేర్కొంది.