
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. రికార్డు స్థాయిలో లక్ష 70వేల రూపాయలకు పైగా నమోదైన బంగారం ధరలు.. ప్రస్తుతం కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.450 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.490 తగ్గింది. ఇక, వెండిపై కూడా భారీగా ధర తగ్గింది. కేజి వెండి ధరపై ఏకంగా 5వేల రూపాయలు తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,170కు తగ్గింది. 22 క్యారెట్ల 10 గోల్డ్ ధర రూ. 1,45,900కు పడిపోయింది. ఇక, వెండి విషయానికొస్తే, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.2,70,000కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.