
నిరసనగా ఆయన నివాసం పై కోడిగుడ్లతో దాడి చేసిన బీజేపీ నాయకులు
మన తెలంగాణ/ బోడుప్పల్ : హిందువులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి ఎంఎల్ఏ మందుల సామెల్ ఇంటి పై సోమవారం బీజేపీ నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే మందుల సామెల్ బ్రాహ్మణులు చదివే వేద మంత్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హిందువులు,బీజేపీ శ్రేణులు ఆగ్రహించాయి.సోమవారం ఎంఎల్ఏ మందుల సామెల్ ఇంటి పై కోడిగుడ్లతో దాడి చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ..ఎలక్షన్స్ టైంలో ఓట్ల కోసం దేవాలయాలు తిరుగుతూ పోరు దండాలు పెట్టి గెలిచిన తర్వాత హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన ద్వంద నీతికి నిదర్శనం అని అన్నారు.గౌరవప్రదమైన పదవిలో ఉండి బాధ్యతను మరిచి ఇలా మాట్లాడడం సబబు కాదని వెంటనే హిందువులందరికీ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే మందుల సామెల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.