Reading Time: < 1 minute

కోత్‌కతా నైట్‌రైడర్స్ సారధిగా మరోసారి కొనసాగింపు..

కోల్‌కతా: ఈనెల చివరి వారంలో ఇండియాన్ ప్రీమిర్ లీగ్(ఐపిఎల్ 2026) 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది దీంతో ఫ్రాంచైజీలన్నీ జట్టు కూర్పుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ వేటలో తలమునకలైంది. గతేడాది తేలిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, ఈసారి కూడా అజింక్య రహానెకే సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 18వ ఎడిషన్‌లో అజింక్య రహానె నాయకత్వంలోని కోల్‌కతా పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి కెప్టెన్‌ను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, రహానె అనుభవం జట్టుకు అవసరమని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రహానె మాకు బెస్ట్ ఛాయిస్. అతడి అనుభవం జట్టుకు ఎంతో కీలకం. ఫ్రాంచైజీ ఇప్పటికే దీనిపై ఒక స్పష్టతకు వచ్చింది అని కోల్‌కతా టీమ్‌కు సంబంధించి పలువురు ప్రముఖులు తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి సయితం రహానే జట్టును నడిపించే బాధ్యలు చేపట్టనున్నాడని వార్తలు షీకార్లు చేస్తున్నాయి.