Reading Time: < 1 minute

ఢాకా: మూడో వన్డేలో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగల భారీ స్కోరును సాధించింది. బంగ్లా బ్యాటర్లలో తాంజిద్ హాసన్ తమిమ్(107) సెంచరీతో కదంతొక్కగా.. లిట్టన్ దాస్(41), తౌహిద్ హిరోయ్(48 నాటౌట్)లు బ్యాట్ ఝలిపించారు. పాక్ బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించారు. దీంతో బంగ్లా భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన పాక్.. 279 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్ సల్మాన్ అఘా(106) సెంచరీతో రాణించినా మిగతావారు విఫలమవడంతో పాక్ ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో తాస్కిన్ లహ్మద్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లా గెలుపు కీలక ప్రాత పోషించాడు.