
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కటక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ సిబి మెడికల్ కాలేజీలో భారీ ఎత్తున మంటల చెలరేగాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానిక ిచేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఐసియులో షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్‌తో సిఎం కలిసి ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులను కూడా పరామర్శించారు. గాయపడిన మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.