Reading Time: < 1 minute

 సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతుల ఖాతాల్లోకి విడుదల

చేయనున్న సిఎం రేవంత్‌రెడ్డి మొత్తం మూడు విడతల్లో

అన్నదాతలకు రూ.9వేల కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం

ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిం ది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేయనున్నట్లు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈమేరకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సిఎం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాల్లో నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో అ క్కడి నుండే రైతు భరోసా తొలి విడుత నిధులు విడుదల చేయనున్నారు. తొలి విడత రైతు భరోసాలో ఒక ఎకరం భూమి కలిగిన 70లక్షల మంది రైతుల  ఖాతాల్లో రూ.3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. మరో 20 రోజుల తరువా త రెండో విడత రైతు భరోసా నిధులు రూ.2,650 కోట్ల రైతు ఖాతాల్లో ప్రభు త్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెల చివర వరకు మూడోవిడతగా మొత్ంత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని, మూడు విడతల్లో 1.50కోట్ల ఎకరాలకు మొత్తం సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.