Reading Time: 2 minutes

ఒక యూటీ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

 ఏప్రిల్ 9నుంచి 29వ తేదీ వరకు

పోలింగ్ మే 4న కౌంటింగ్

పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో

పోలింగ్ తమిళనాడు, కేరళం,

అస్సాం, పుదుచ్చేరిలో ఒక

దశతో ముగియనున్న ఎన్నికలు

ఎన్నికల ప్రధానాధికారి ప్రకటన

వివిధ రాష్ట్రాల్లోని ఎనిమిది

అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికల

షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల తేదీల వివరాలతో కూడిన షె డ్యూల్‌ను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్ర ధానాధికారి జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. ఇతర ఇరువురు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివే క్ జోషితో కలిసి ఎన్నికల తేదీలు వెలువరించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అసోం రా ష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో అసోం, కేర ళం, పుదుచ్చేరిలలో ఎన్నికలు ఒకే విడతలో ఏప్రి ల్ 9న జరుగుతాయి. కాగా పశ్చిమబెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు ఏప్రిల్ 23, 29తేదీల్లో జ రుగుతాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం మీద 824 స్థానాలకు ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. తమిళనాడులో మొ త్తం 234 స్థానాలు ఉన్నాయి. డిఎంకె నేత స్టాలిన్ సిఎంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థా నాలు ఉన్నాయి, టిఎంసి అదినేత్రి మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేరళలో 104 స్థానాలు ఇక్కడ వామపక్ష సీనియర్ పినరయి విజయన్ సి ఎం. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నా యి.

ఇక్కడ బిజెపి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి గా హిమంత బిస్వా శర్మ ఉన్నారు. పుదుచ్చేరిలో ముఖ్యమంత్రిగా ఎన్ రామస్వామి ఉన్నారు. మొత్తం మీద ఈ ఎన్నికలలో 17.4 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు. ఇది అతి పెద్ద ఎన్నికల ప్రజాస్వామిక ప్రక్రియ అని సిఇసి తెలిపారు. ఇంత మంది ఓటర్లు ఉండటం విశేషం అని, ఇదది ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీచ దక్షిణాఫ్రికా జనాభాతో సమానం అని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. అర్హులైన పౌరులందరికి ఓటు హక్కు ఉంది. దీనిని అంతా సక్రమంగా వినియోగించుకోవడం పౌరుల బాధ్యత అని పిలుపు నిచ్చారు. ఇక గోవా, కర్నాటక, త్రిపుర, నాగాలాండ్‌లలో కలిపి ఐదు అసెంబ్లీ స్ధానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇవి ఎప్రిల్ 9న నిర్వహిస్తారు. గుజరాత్ మహారాష్ట్రలలో మూడు స్థానాలకు ఏప్రిల్ 23న ఉప ఎన్నిక ఉంటుందని సిఇసి ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఈ ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికల అవసరం ఏర్పడింది. ఇందులో మహారాష్ట్రలోని బారామతి కూడా ఉంది.