Reading Time: < 1 minute

మొదటి విడతలో ఒక ఎకరం వరకు 70 లక్షల మంది ఖాతాల్లో రూ.3,590 కోట్లు

20 రోజుల్లో రూ.2,650 కోట్లు

సిఎం రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేయనున్నట్లు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈమేరకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సిఎం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాల్లో నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి నుండే రైతు భరోసా తొలి విడుత నిధులు విడుదల చేయనున్నారు. తొలి విడత రైతు భరోసాలో ఒక ఎకరం భూమి కలిగిన 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. మరో 20 రోజుల తరువాత రెండో విడత రైతు భరోసా నిధులు రూ. 2,650 కోట్ల రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెల చివర వరకు మూడోవిడతగా మొత్ంత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని, మూడు విడతలుగా మొత్తం సుమారు తోమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.