
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి సింగిల్‌ని విడుదల చేశారు. ‘నమో రే నమో రే’ అంటూ సాగే ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్ అందించారు. జునైద్ కుమార్ ఈ పాటకు సంగీతం అందించగా.. సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ పాటని కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పోలిన భారీ సెట్‌లో చిత్రీకరించారు. ఈ పాటని గణేశ్ ఆచార్య, శ్రేష్ఠి కొరియోగ్రాఫీ చేశారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ పాట ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరు ఆ సాంగ్‌ను చూసేయండి..