
మౌంట్ మౌంగానుయి: కొద్ది రోజుల క్రితమే టి-20 ప్రపంచకప్‌లో ఫైనల్స్ వరకూ చేరుకున్న న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో ఘోరంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు కేవలం 91 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్లు ఫిన్ ఆలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ వంటి ఆటగాళ్లు కివీస్ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపించింది.
అయితే డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ వంటి సీనియర్లు ఉన్నా.. తమ స్థాయి ఆటను చూపించలేకపోయారు. సఫారీ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్‌మన్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత ఈ స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో కానర్ ఎస్టర్‌హైజెన్ 45 పరుగులతో అజేయంగా నిలిచాడు.