
సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ‘ది హండ్రెడ్ లీగ్’ కోసం జరిగిన వేలంలో పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంతో భారత నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఐపిఎల్‌లోనూ ఎస్‌ఆర్‌హెచను తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి. అయితే ఈ విషయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బిసిసిఐ తేల్చి చెప్పేసింది. అయితే, ఈ సీజన్‌లో అబ్రార్ అహ్మద్ ది హండ్రెడ్ లీగ్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటివరకు పాక్ క్రికెట్ బోర్డు నుంచి అబ్రార్‌కు ఎన్‌ఒసి రాలేదు. ఇంగ్లిష్ లీగ్ సమయంలోనే పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ప్రణాళఇలను సిద్ధం చేసుకుంది. దీంతో జాతీయ జట్టు బాధ్యల నేపథ్యంలో అబ్రార్‌కు ఎన్‌ఒసి ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ది హండ్రెడ్ లీగ్ జూలై 21 నుంచి ఆగస్ట్ 16 వరకు జరుగుతుంది. వెస్టిండీస్ పర్యటనకు పాకిస్తాన్ కూడా జూలై 15న వెళ్లనుంది. ఆగస్టు 7 రకు రెండు జట్ల మధ్య రెండు టెస్టులు జరుగుతాయి.