Reading Time: < 1 minute

హైదరాబాద్: మహిళల స్వావలంభనకు కృషి చేస్తున్నామని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని అన్నారు. పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాంధీభవన్ లో మహేష్ గౌడ్ మాట్లాడారు. మహిళల నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మహిళల పేరు మీదుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలియజేశారు. 2014-18 నుంచి బిఆర్ఎస్ హయాంలో ఒక్క మహిళా మంత్రి లేరని, మహిళలను రాష్ట్రపతిగా, స్పీకర్లు, గవర్నర్లు, సిఎంలుగా చేసిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. ఇంట్లో కూర్చుంటామంటే రాజకీయాల్లో గెలవలేరని, కాంగ్రెస్ లో కష్టపడినవారికి కచ్చితంగా పదవులు వస్తాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టారని, బిఆర్ ఎస్ హయాంలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరికేవని విమర్శించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై అనుమానాలున్నాయని, ఆయన పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. బిఆర్ఎస్ నేత డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే.. కెటిఆర్ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య భారతదేశంలో తొలిసారి కులగణన చేసిన రాష్ట్రం తెలంగాణ అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసించారు.