
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అశ్వరావు పేట వెళ్లుండగా అదుపుతప్పి బొలెరో బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.