
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ ‘కొరియన్ కనకరాజు’ను మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం హార్రర్, కామెడీని మిళితం చేస్తూ తెరకెక్కుతోంది. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. టీం ఇప్పుడు ఫైనల్ షూటింగ్ షెడ్యూల్‌ను సౌత్ కొరియాలో ప్రారంభించింది. కీలకమైన ఒక వారం రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో పాటలు, కథలోని ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనున్న ఈ షెడ్యూల్ ను కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో ప్రధాన భాగం షూటింగ్ పూర్తి కాగా, ఇప్పుడు కొరియాలో జరుగుతున్న ఈ ఫైనల్ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తికానుంది. అనంతరం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి వెళ్ళనుంది.