Reading Time: < 1 minute

హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో భువనగిరి మండలం తుక్కపురంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె, కుమారుడిని తల్లి కత్తితో పొడిచింది. గత కొంతకాలంగా భర్త నరేంద్ర రెడ్డి, నీలిమ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు వీరి వివాదం తరాస్థాయికి చేరుకోవడంతో నీలిమ ఆవేశంతో పుట్టింకి వెళ్లిపోయింది. కొన్ని రోజులు అక్కడే ఉండగా.. నరేంద్ర రెడ్డి నీలిమ పుట్టింటికి వెళ్లి తన ఇంటికి రమ్మని పిలిచాడు. పుట్టింటి నుంచి వచ్చిన వెంటనే తన పిల్లలను హత్య చేయడానికి పాల్పడి.. తను ఆత్మహత్యకు యత్నించింది. నీలిమ కత్తితో పొడవడంతో కుమార్తె క్రితి రెడ్డి (14) మృతి చెందింది. కుమారుడు ఆశాంత్ రెడ్డి(11)కి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.