Reading Time: < 1 minute

స్టార్ హీరోయిన్ అనుష్క తెలుగులో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పిన స్టోరీకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కథలోని వైవిధ్యం, ఆమె పాత్రలోని లోతు నచ్చడంతో షూటింగ్ కోసం కాల్షీట్లు కేటాయించినట్లు తెలిసింది. సినిమాలో అనుష్క సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతుందట. సోషల్ డ్రామా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తారు. అరుంధతి, భాగమతి చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతుంది. నందినీ రెడ్డి ఈ కథను డీల్ చేసే విధానం కొత్తగా ఉండబోతోందట. ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలున్న కథను తెరకెక్కించడం నందిని రెడ్డికి కొత్త అనుభవం అని తెలుస్తోంది. ప్రస్తుతం నందిని రెడ్డి… సమంత ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశలో ఉంది. మిగతా పనులు పూర్తి చేసి మేలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.