
మన తెలంగాణ/హైదరాబాద్: నగరం చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) తయారీ కోసం సర్వే నిర్వహించేందు కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చే సింది. హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. లోక్‌సభలో తాను రూల్-377 కింద లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ ఈ మేరకు అధికారిక లేఖ ద్వారా వివరాలు అందజేశారని ఆయన పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ తయారీకి అవసరమైన సర్వేను కేంద్రం మంజూరు చేయడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తు తం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ, రీజినల్ రింగ్ రోడ్డు వెంట రైల్వే లైన్ అలైన్‌మెంట్‌ను ఖరారు
చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని ఆయన వివరించారు. డిపిఆర్ సిద్ధమైన త ర్వాత, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతారని ఆయన చెప్పా రు. అనంతరం నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక మం త్రిత్వ శాఖల ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టుకు తుది మంజూరు లభిస్తుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి పెద్దపీట పడనుందని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి నియోజకవర్గంతో పాటు తెలంగాణా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక చొరవ చూపినందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాసినట్లు కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు.