Reading Time: < 1 minute

సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్న అంశంపై ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా తమిళ మూవీ తాయి కళవి సినిమా సక్సెస్ మీట్ లో రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కంటెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సక్సెస్ మీట్‌లో రాధిక మాట్లాడుతూ ‘మా సినిమా కేవలం 150 రూపాయల టికెట్ రేటుతోనే దాదాపు 60 కోట్లు వసూలు చేసింది. కానీ కొంతమంది స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ.1500,- రూ.2000 వరకు ఉంటున్నాయి. మీరు కరెక్ట్ గా లెక్కలు వేస్తే మేమే వారికంటే పెద్ద సక్సెస్ సాధించినట్టే అవుతుంది”అని అన్నారు.