Reading Time: < 1 minute

కరూర్: రైల్వే లెవల్ క్రాసింగ్‌ను దాటుతుండగా కాలేజీ బస్సును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం కరూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో  24 మంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  50 మంది విద్యార్థులతో వెళ్తున్న కళాశాల బస్సు మానవరహిత లెవల్ క్రాసింగ్‌ను దాటడానికి ప్రయత్నించగా.. దిండిగల్ నుండి కరూర్ వెళ్తున్న గూడ్స్ రైలు బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కరూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. తర్వాత జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జోష్ కె తంగయ్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై తదుపరి విచారణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.