Reading Time: < 1 minute

ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ మహిళా టీమ్ విజేగా నిలిచింది. శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 20 గోల్స్ తేడాతో ఆతిథ్య భారత జట్టును ఓడించింది. కాగా, ఈ ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే మహిళా హాకీ ప్రపంచకప్ కోసం అర్హత పోటీలను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు స్కాట్లాండ్, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఇంగ్లండ్ జట్లు పాల్గొన్నాయి. భారత్, ఇంగ్లండ్‌లు ఇప్పటికే వరల్డ్‌కప్ బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి. కాగా, టైటిల్ కోసం జరిగిన పోరులో మాత్రం భారత్ ఓటమి పాలైంది. ఆరంభం నుంచే ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. భారత దాడులను సమర్థంగా తిప్పికొడుతూ అలవోక విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది.