Reading Time: < 1 minute

 అత్యంత అరుదైన బాంబే బ్లడ్‌గ్రూప్‌ను ఎయిమ్స్ గోరఖ్‌పూర్ వైద్యుల బృందం గుర్తించింది. తమ వద్దకు చికిత్సకు వచ్చిన ఓ గర్భిణీకి పరీక్షల దశలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఉండే ఎ బ్లడ్ గ్రూప్‌లో అసలు కానరాని, అతి తక్కువగా కన్పించే సబ్ గ్రూప్ రక్తాన్ని ఈ మహిళలో కనుగొన్నారు. 8 నెలల గర్భంతో ఉన్న ఈ మహిళ వైద్య పరీక్షల క్రమంలో తరచూ లోపాలు తలెత్తడం, పరీక్షల ఫలితాలలో తేడాలు ఉండటంతో వైద్య బృందానికి ఈ మహిళ శారీరక స్థితి సవాలుగా మారింది. ఈ మహిళకు డాక్టర్ల బృందం క్షుణ్ణంగా పరీక్షలు జరిపింది.

మామూలుగా ఆమెలో ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లు తేలింది. అయితే దీని ఉపరకం ఆమె రక్తంలో ఉందని,అందుకే అసాధారణ రీతిలో ఆమె ఆరోగ్యం ఉంటోందని గుర్తించారు. ఈ అరుదైన బ్లడ్ గ్రూప్‌ను బాంబే బ్లడ్‌గ్రూప్‌గా పిలుస్తారు. ఈ మహిళ ఈ బ్లడ్‌గ్రూప్‌తో ఉందని నిర్థారణ అయింది. దీనితో ఈ మహిళకు ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్య చికిత్సలు, పరీక్షలకు సిద్ధం అయినట్లు ఎయిమ్స్ గోరఖ్‌పూర్ సిఇఒ , కార్యనిర్వాహక సంచాలకులు విభా దత్తా తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన వారిలో ఇటువంటి అత్యంత అరుదైన బ్లడ్‌గ్రూప్ ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.