
ప్రపంచ యుద్ధ భయాల వేళ ఉత్తర కొరియా భారీ స్థాయి బలప్రదర్శనకు దిగింది. ఒకేరోజు వరుసగా పది బాలిస్టిక్ క్షిపణులను శనివారం తూర్పు సముద్రం వైపు విజయవంతంగా ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా సైన్యం ప్రకటించింది. ఓ వైపు తమ శత్రుదేశం దక్షిణ కొరియా అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలకు దిగిన దశలో కిమ్ ఈ చర్యకు దిగారు. ఈ ప్రయోగ పరీక్షలను దేశ అధినేత కిమ్ తన 13 ఏండ్ల కుమార్తె కిమ్ జు యేతో కలిసి కాన్షరెన్స్ హాల్‌లో కూర్చుని ఉత్సాహంగా తిలకించారు. చప్పట్లు చరిచారు. దేశ రాజధాని ప్యాంగాంగ్‌కు వద్ద ఓ చోటు నుంచి ఈ క్షిపణును పరీక్షించినట్లు దేశ సైనిక బలగాల సంయుక్త అధినేత తెలిపారు. ఈ పరీక్షలపై జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. సముద్రంలో పయనించిన ఈ క్షిపణులు కొన్ని తమ దేశ నిర్ణీత ఆర్థిక వాణిజ్య కేంద్రాల వెలుపలి జలాల్లో వచ్చిపడ్డాయని మండిపడ్డారు.