Reading Time: < 1 minute

ఎల్‌బి స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న ఇఫ్తార్ విందు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దావత్ ఎ ఇఫ్తార్ 15వ తేదీ నిర్వహించనున్నారు. దీని దృష్టా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.

ఏ.ఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుండి బి.జె.ఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏ ఆర్ పెట్రోల్ పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు.

బషీర్‌బాగ్ నుండి ఏ.ఆర్ పెట్రోల్ పంప్ వైపు వచ్చే వాహనాలను బి.జె.ఆర్ విగ్రహం వద్ద ఎస్‌బిఐ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

సుజాత స్కూల్ లేన్ నుండి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు.

రద్దీగా ఉండే జంక్షన్లు …

ట్రాఫిక్ ఆంక్షల వల్ల లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, బి.జె.ఆర్ విగ్రహం సర్కిల్, ఎస్.బి.ఐ గన్ ఫౌండ్రీ, ఏ.ఆర్. పెట్రోల్ పంప్, కె.ఎల్.కె బిల్డింగ్ మరియు లిబర్టీ.

ఆర్టీసీ బస్సులు…

రవీంద్ర భారతి నుండి బి.జె.ఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను, ట్రాఫిక్‌ను బట్టి ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు.