Reading Time: < 1 minute

భర్త మీద కోపంతో తన పిల్లలు భర్తకు కూడా దక్కరాదని తల్లి తన ఇద్దరు కొడుకులతో గార్గేయపురం చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. ఎపిలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలీవిధంగా ఉన్నాయి. అలంపూర్‌కి చెందిన రాజుతో గార్గేయపురానికి చెందిన రాజేశ్వరి(36)కి కొన్నాళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి అబ్రహం (6) సుకుమార్(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలం సంసారం సజావుగానే సాగింది. ఇటీవల భార్యాభర్తల గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలోనే ఇటీవల భర్త తో ఘర్షణపడ్డ రాజేశ్వరి పుట్టిన ఊరు గార్గేయపురంలో కొన్ని రోజులుగా ఉంటుంది. ఏమైందో ఏమో గానీ శుక్రవారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి చెరువులో దూకేసింది. శనివారం ఉదయం ముగ్గరు మృతదేహాలు బయట పడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.