Reading Time: < 1 minute

హైదరాబాద్: పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో పాక్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు సమజ్జీవులుగా ఉన్నారు. పాకిస్థాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రారంభం కాగానే వర్షం కురవడంతో మ్యాచ్ 32 ఓవర్లకు కుదించారు. బంగ్లా 23.3 ఓవర్లలో 114 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో వన్డేలో పాక్ ఆటగాడు సల్మాన్ అఘా రనౌట్ వివాదాస్పదంగా మారింది.

దీనిపై బంగ్లా వికెట్ కీపర్ లిట్టన్ దాస్ స్పందించారు. రూల్స్ ప్రకారం అఘా ఔటయ్యారని, తాము ఇక్కడి ఛారిటీ మ్యాచ్ ఆడడం లేదన్నారు. ఇదో అంతర్జాతీయ మ్యాచ్ అని, ఔట్ మీద ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయని, మైదానంలో ఉన్నంతసేపు వాళ్లు మాకు ప్రత్యర్థులుగా ఉంటారని అందుకే రనౌట్ చేశామని వివరించాడు. ఆఘా రనౌట్ అనేది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పాక్ మాజీ ఆటగాడు రమీజా రజా తెలిపాడు. రూల్స్ ప్రకారం అది రనౌటే కానీ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చురకలంటించారు. బ్యాటర్ బంతిని అందుకొని ఫీల్డర్ ఇవ్వాలనుకున్నాడు, అలా రనౌట్ అవుతానని అతడు ఊహించలేదన్నాడు.

ఓ కెప్టెన్‌గా క్రీడాస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తెలిపాడు. వికెట్లు తీయాలనే కక్షతో అలా రనౌట్ చేయడం తగదని ఎద్దేవా చేశారు. బంగ్లాదేశ్ కెప్టెన్ చేసినట్లు యువ క్రికెటర్లు ఎవరూ చేయవద్దని సలహా ఇచ్చాడు. రూల్స్ ప్రకారం తాను రనౌట్ అయ్యానని సల్మాన్ అఘా స్పందించాడు. క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాలని, తాము భవిష్యత్‌లోఏ కూడా ఇలా చేయమని బంగ్లా ఆటగాడికి చురకలంటించారు. బంతి బ్యాట్, ప్యాడ్‌ను తాకిందని, బౌలర్‌కు బంతిని అందిందామని అనుకున్నానని, అతడు బంతిని వికెట్లకు కొట్టడం సరికాదన్నారు. తనకు పరుగు తీసే ఉద్దేశం లేదని ఆఘా వివరించాడు.