Reading Time: < 1 minute

సిల్చార్: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ పై ఫైరయ్యారు.పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఆందోళనలు సృష్టిస్తోందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలోని సిల్చార్ పట్టణంలో శనివారం ప్రధాని మోడీ రూ.23,550 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచం యుద్ధాలను ఎదుర్కొంటుందని.. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరించడంలో విఫలమైందని అన్నారు. ఈశాన్య ప్రాంతాన్ని కాంగ్రెస్ విస్మరించిందని.. అస్సాం యువతను హింస, ఉగ్రవాదం వైపు తప్పుదారి పట్టించిందని విమర్శించారు.