
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించడంతో ఎయిడ్స్ రక్తంతో యువతికి యువకుడు ఇంజక్షన్ ఎక్కించాడు. మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయం అయింది. యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ ఉందని తేలడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. ఈనెల 11న యువతి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ మనోహర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లికి ఒప్పుకోలేదని యువతికి హెచ్ఐవి రక్తాన్నిఎక్కించాడు. యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.