
చెన్నై: దేశంలో ఏర్పడిన వంట గ్యాస్ సిలిండర్ల సంక్షోభంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరతతో తమిళనాడులో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ప్రజలపై కొంత భారాన్ని తగ్గించాలని.. ఇందులో భాగంగా విద్యుత్ పై సబ్సిడి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా యూనిట్‌పై 2 రూపాయలు సబ్సిడీని ప్రకటించింది.
LPG నుండి విద్యుత్ స్టవ్‌లకు మారే రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్‌లు, ఇతర ఆహార తయారీ కేంద్రాలకు యూనిట్‌కు రూ.2 చొప్పున రాయితీని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత ఏర్పడన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాణిజ్య అవసరాల కోసం LPG వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు అమల్లో ఉన్నంత కాలం తమిళనాడులో ఈ రాయితీ వర్తించనుంది.