Reading Time: < 1 minute

అమరావతి: గృహాలు, ఆస్పత్రులు, హాస్టళ్లు.. ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ పంపిణీ జరగాలని ఎపి మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్ లైన్ లోనే జరగాలని స్పష్టం చేశారని అన్నారు. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ విషయంలో సొమ్ము చేసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు అని..సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవు అని పయ్యావుల సూచించారు. మొదట బుక్ చేసుకున్నవారికి డెలివరీలో మొదటి ప్రాధాన్యత అని..గ్యాస్ దొరకదేమో అనే ఆందోళనతో బుకింగ్ చేయవద్దు అని అన్నారు. కేంద్రంతో నిరంతర సంప్రదింపులు సమన్వయం చేసుకుంటున్నామని, పైపులైన్ ద్వారా వినియోగించే ఆలోచనలు చేస్తున్నామని తెలియజేశారు. పైపులైన్ గ్యాస్ సరఫరాదారులతోనూ సమావేశం నిర్వహిస్తామని, సోమవారం సిఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని, రాష్ట్రంలో ప్రస్తుతానికి గ్యాస్ సరఫరాకు ఇబ్బంది లేదని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.