Reading Time: < 1 minute

మెదక్: రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయాడు.. కుమారుడు అంత్యక్రియులు జరగాల్సి ఉండగా బాధను దిగమింగుకొని కుమారుడు పరీక్షలకు హాజరయ్యాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉషిరికపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కమ్మరి నాగరాజు(45) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శనివారం నాగరాజులు అంత్యక్రియలు జరపాల్సి ఉండగా దు:ఖంలో కుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. తండ్రి శవం ఇంట్లో పెట్టుకొని కుమారుడు పరీక్షలకు హాజరు కావడంతో అందరినీ కలవరపరిచింది.