Reading Time: < 1 minute

హైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్లలో కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధిని పట్టించుకోలేదని కేంద్రమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టాం అని అన్నారు.  అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు  మహాపాదయాత్ర చేశారు. ఇటీవల గెలుపొందిన కార్పొరేటర్లు తన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా  కరీంనగర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరీంనగర్ మేయర్ పీఠం బిజెపికి కైవసమైతే కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటానని,  అంజన్న క్షేత్రాభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని బండిసంజయ్ తెలియజేశారు.