
హైదరాబాద్: ఐపిఎల్ 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. అన్ని టీమ్‌ల ఆటగాళ్లు మ్యాచ్‌ల కోసం ప్రాక్టీస్ ప్రారంభించారు. ముంబయి ఇండియన్స్ మాత్రం రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్ వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంటే రోహిత్ బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు కానీ ఫీల్డింగ్‌లో కనిపించడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చొప్రో స్పందించారు. రోహిత్ శర్మ ప్రస్తుతం 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించాడని, ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడని, అతడి కెప్టెన్సీలో ముంబయిన్ ఇండియన్స్ ఐపిఎల్ టైటిళ్లను గెలుచుకుందని గుర్తు చేశారు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు రోహిత్ సలహాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేశాడు. రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవద్దని చొప్రా సూచించాడు. గత సీజన్‌లో కూడా రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే.