
హైదరాబాద్: మన దేశంలో మాత్రం గ్యాస్ ధరలు పెరగలేదని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్ ధరలు పెరిగాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ కొరత లేదని, గ్యాస్ కొరతను కావాలనే సృష్టిస్తున్నారని రామచందర్ రావు విమర్శించారు. సామాన్యుడికి ఇబ్బందులు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలను నియంత్రణలో పెట్టిందని, గతంలో గ్యాస్ ధరలు రూ.1,200 ఉంటే.. మోడీ ప్రభుత్వం రూ.900 చేసిందని తెలియజేశారు. అబద్ధాలతో ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. మూసీ పునరుజ్జీవానికి రూ.7 వేల కోట్లు అంటున్నారని, మూసీ ప్రాజెక్టుకు బిజెపి వ్యతిరేకం కాదని, మూసీలో పడే డ్రైనేజీ నీటిని ఎలా ఆపుతారని.. 50 మీటర్ల బఫర్ జోన్ అనేది అవసరం లేదని అన్నారు. మనజాతిపిత విగ్రహానికి 100 ఎకరాలు కావాలా? అని ప్రశ్నించారు. ఎవరికీ నష్టం లేకుండా సబర్మతి ప్రాజెక్టు పూర్తి చేశామని రామచందర్ రావు పేర్కొన్నారు.