Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మోచర్ల వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వీరేపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో యువకులు ఫేర్‌వెల్ పార్టీ చేసుకున్నారు. అనంతరం యువకులు తమ ఇండ్లలోకి బైక్‌లపై తిరుగుపయనమయ్యారు. డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాం జంక్షన్ వద్ద జరిగింది. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.