Reading Time: < 1 minute

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్ అయిన దేవర: పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించింది. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ను కొరటాల శివ అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. తొలి భాగంలో వర పాత్రలో భయం , అతడి అమాయకత్వంపై ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ రెండో భాగంలో వర పాత్ర విశ్వరూపాన్నిచూపించబోతున్నారు. తండ్రి దేవర ఆశయాలను వర ఎలా ముందుకు తీసుకెళ్లాడు? సముద్రం మీద తన ఆధిపత్యాన్ని ఎలా సుస్థిరం చేసుకున్నాడు? అనే పాయింట్లు హైలైట్ చేస్తూ వర పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. దేవర మరణం వెనుక ఉన్న అసలైన కారణం కుట్రలు, తండ్రీకొడుకుల మధ్య ఉన్న భావోద్వేగపూరితమైన బంధాన్ని కొరటాల మరింత లోతుగా ఆవిష్కరించనున్నారు. ఈ ఎమోషనల్ డ్రామానే పార్ట్ 2 కి వెన్నెముకగా నిలవనుంది. దేవర పార్ట్ 2 లో స్క్రీన్ ప్లేను మరింత గ్రిప్పింగ్‌గా ఉత్కంఠభరితంగా మలచనున్నారు. సైఫ్ అలీ ఖాన్ (భైరా), ఎన్టీఆర్ పాత్రల మధ్య సాగే మైండ్ గేమ్స్, ఎత్తుకు పైఎత్తులు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే జాన్వీ కపూర్ (తంగ) పాత్రను రెండో భాగంలో కేవలం పాటలకే పరిమితం చేయకుండా, కథలో కీలక భాగం చేయబోతున్నారు. వర,- తంగ మధ్య నడిచే ప్రేమకథతో పాటు, కథను మలుపు తిప్పే కొన్ని సన్నివేశాల్లో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది.