
వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలను అడ్డుకుంటే దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఖర్గ్ ద్వీపంలోని ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తామని, సైనిక లక్ష్యాలపై ఇప్పటికే దాడులు చేశామని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదని, అమెరికా సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దానని తెలియజేశారు. ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధం ఉండకూడదని, అమెరికా సహా మధ్యప్రాచ్యంలోని దేశాలను బెదిరించే పరిస్థితి ఉండకూడదని, ఇరాన్ సైన్యం ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోతే మంచిదని సూచించారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేనని ట్రంప్ పేర్కొన్నారు.