
అమరావతి: లేఔట్‌లో ఆరు కొండ చిలువలు కనిపించిన సంఘటన విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పెద్దముషిడివాడ గ్రామంలోని ఓ లేఔట్‌లోని సిమెంట్ పైపుల్లో కొండచిలువలు కనిపించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటేన అటవీ శాఖ, స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇచ్చారు. పైపులను జెసిబిలతో తొలగించే క్రమంలో రెండు కొండ చిలువలు మృతి చెందాయి. మిగిలిన నాలుగు కొండచిలువలను స్నేక్ క్యాచర్స్ పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అటవీ శాఖ సిబ్బంది కొండచిలువలను యారాడ కొండల్లో విడిచిపెట్టారు. ఒక్కొక్కటి 12 అడుగుల పొడవు ఉన్నాయని తెలిపారు.