
హైదరాబాద్: మెట్రో స్టేషన్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ పరిధిలో జరిగింది. నిత్యతేజ్ అనే యువకుడు బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం అర్థరాత్రి సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మెట్రో స్టేషన్‌కు నిత్యతేజ్ చేరుకున్నాడు. మెట్రో స్టేషన్‌లోని రెండో అంతస్థు నుంచి కిందకు దూకాడు. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.