
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ఫస్ట్ రెండు సింగిల్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ జోష్ ని కొనసాగిస్తూ, మేకర్స్ ఇప్పుడు మూడో సింగిల్ ‘బంగారు బొమ్మ’ను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు నాగ వంశీ హృదయాన్ని హత్తుకునే విధంగా పాటను కంపోజ్ చేశారు. స్క్రీన్‌పై సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ మధ్య కనిపించే క్యూట్ కెమిస్ట్రీ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దింది.