
హయత్‌నగర్: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను భర్త సుత్తెతో కొట్టి చంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి భార్య భర్తలు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంతో రగిలిపోయిన భర్త సుత్తె తీసుకొని భార్య తలపై కొట్టాడు. భార్యపై తలపై పెయింట్ డబ్బా పడడంతో గాయపడిందని కట్టుకథ అల్లాడు. ఆమె తీవ్రంగా గాయపడడంతో యశోద ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని తెలిపారు. తండ్రి ప్రవర్తనపై కూతుళ్లకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.