Reading Time: < 1 minute

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో మ్యూజిక్ కంపోజర్, -హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. హీరో-, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీగౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో మంచి అంచనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో హీరో జివి ప్రకాష్ కుమార్ స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. హ్యాపీ రాజ్ మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది.