Reading Time: 2 minutes

దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం శుక్రవారం మరింత భీకర రూపు దాల్చంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఒకవైపు తీవ్రదాడులు చేస్తున్నసమయంలోనే శుక్రవారం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌అమెరికా ఉమ్మడిద బలగాలు గురిపెట్టాయి. టెహ్రాన్ స్కేర్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. యూనివర్శిటీ దగ్గరిలోని ఇంగెలాబ్ స్ట్రీట్ వద్ద ఉన్న ఫిరదౌసి స్వేర్ లక్షంగా భీకర పేలుళ్లు జరిగాయి. మినాబ్ స్కూల్ చిన్నారులను చంపివేయడాన్ని నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున గుమికూడిన దశలోనే దాడులు జరిగాయి. వార్షిక క్వాడ్స్ దినం సందర్భంగా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపే ప్రదర్శనకు కూడా జనం వేలాది సంఖ్యలో వెల్లువెత్తారు. ఖమేనీ చిత్రపటాలను చేతిలో పట్టుకుని ఇజ్రాయెల్,

అమెరికా వ్యతిరేక నినాదాలతో ర్యాలీ జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చావు తప్పదని నినదించారు. ర్యాలీ లక్షంగా పేలుళ్లు జరుగుతున్నప్పటికీ జనం ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. పేలుళ్ల ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. డజన్ల సంఖ్యలో క్షతగాత్రులు అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరాన్ స్పందించలేదు. తమ పతీకార దాడులు తీవ్రతరం చేస్తామని సుప్రీం లీడర్ మొజ్తాబా చెప్పిన గంటల వ్యవధిలో టెహరాన్ , మరో నగరం ఖజ్విన్‌లోనూ దాడులు తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ముందుగానే ప్రకటించారు. ఇరాన్ సైనిక వ్యవస్థను దెబ్బతీస్తామని వేర్వేరుగా ట్రంప్ , నెతన్యాహు హెచ్చరించారు.

బుర్జ్ ఖలీఫా సమీపంలో దాడి..

ఈ క్రమంలోనే ఇరాన్ శుక్రవారం తెల్లవారుజాము నుంచే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను, అక్కడి ఎయిర్‌పోర్టులను, చమురు క్షేత్రాలను లక్షంగా ఎంచుకుని దాడులు ఉధృతం చేసింది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద కూడా డ్రోన్లు కూలినట్లు తెలుస్తోంది. దాని వైనకవైపు నుంచి నల్లని దట్టమైన పొగలు వెలువడ్డాయి. గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల ధ్వంసానికి ఇరాన్ ప్రయోగించిన దాదాపు 50 డ్రోన్లను సౌదీ వైమానిక బలగాలు కూల్చివేశాయి. ఒమన్‌లోడ్రోన్ల దాడులలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అక్కడి సోహర్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో డ్రోన్ల దాడితో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక్కడ నేలకూలినడ్రోన్ల శకలాలు ధాటికి ప్రజలు గాయపడ్డారు. బహరైన్‌లో భారీ స్థాయిలో సైరన్లు మోగాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫెనాన్సియల్ సెంటర్‌లోని అమెరికా స్థావరాలను ఎంచుకుని ఇరాన్ దాడులు జరిగాయి. ఇప్పటి వరకు ఇరాన్‌లో 1444మంది మృతి చెందారు.

అమెరికా విమానం కూలి ఆరుగురు మృతి

ఇరాక్‌లో అమెరికా సైన్యానికి చెందిన కెసి 135 రిఫ్యూయలింగ్‌విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది మృతి చెందారని అమెరికా సైన్యం తెలిపింది. ఇరాక్ సేనలు పొరపాటున ఈ నౌకను దెబ్బతీశాయా? లేక ఇరాన్ దాడులు సాగించిందా? అనేది నిర్థారణ కాలేదు. తాము ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది. శత్రువు లేదా పొరపాటు దాడులు జరిగి ఉంటాయని తాము అనుకోవడం లేదన్నారు.

ఇరాన్‌లో 200 ప్రాంతాల్లో దాడులు..

ఇరాన్‌పై శుక్రవారం దాడులను తీవ్రతరం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహరాన్‌తో పాటు 200కు పైగా చోట్ల ఇరాన్ వైమానిక దాడులు సాగాయి. ఇక ఒమన్‌లో శుక్రవారం ఓ డ్రోన్ కూలిన ఘటనలో ఇద్దరు విదేశీయులు మృతి చెందారు. భారతీయ పతాకంతో కూడిన ఓ చమురు రవాణా నౌక శుక్రవారం హర్మూజ్ జలసంధి మీదుగా ఆఫ్రికాకు క్షేమంగా వెళ్లింది. భారతీయ జెండా వల్ల ఇరాన్ దాడుల నుంచి తప్పించుకుంది. ఇప్పటికీ మరో 27 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి.