
కొలంబో: శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై అమెరికా సబ్‌మెరైన్ చేసిన దాడిలో మృతులైన ఇరాన్ సైనికులకు సంబంధించి 45 మృతదేహాలను ఇరాన్ దౌత్య కార్యాలయానికి శ్రీలంక శుక్రవారం అప్పగించింది. గాలే హార్బర్ పోలీస్ అభ్యర్థనపై చీఫ్ మెజిస్ట్రేట్ సమీర డొడన్‌గొడ కరపితీయ లోని నేషనల్ హాస్పిటల్ డైరెక్టర్‌కు మార్చి 11న ఇరాన్ సైనికుల మృతదేహాలను అప్పగించాలని ఆదేశించారు.
అమెరికా సబ్‌మెరైన్ దాడితో మునిగిపోయిన ఇరాన్ నౌక నుంచి 84 ఇరాన్ సైనికుల మృతదేహాలను వెలికి తీయడమైందని శ్రీలంక వివరించింది. ఈ మృతదేహాలతోపాటు సజీవంగా ఉన్న 32 మందిని గత గురువారం ఆస్పత్రి నుంచి తీసుకు రావడమైందని శ్రీలంక రక్షణ మంత్రిత్వ కార్యదర్శి సంపత్ దులియకొంత విలేకరులకు వెల్లడించారు.