Reading Time: < 1 minute

చండీగఢ్: పంజాబ్‌కు చెందిన యువ ఫుట్‌బాల్ అటగాడు రవీందర్ సింగ్ (25) అకాల మరణం చెందాడు. ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఐఎఫ్‌ఎల్)లో నాంధారి క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీందర్ స్థానికంగా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ మైదానంలోనే ప్రాణాలు విడిచాడు. తీవ్ర గుండె నొప్పి రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించాడు.

రవీందర్ ను పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని ప్రకటించారు. కాగా, రవీందర్‌కు నివాళులు అర్పించేందుకు ఐఎఫ్‌ఎల్‌లో ఆడే ఆయా జట్లకు చెందిన ఆటగాళ్లు అతని స్వగ్రామం నవాన్‌షహ్రకు చేరుకున్నారు. కాగా, రవీందర్ మృతితో భారత ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది.